Bhatti Vikramarka: కొనసాగుతున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర...

Ongoing CLP leader Bhatti Vikramarka Padayatra
x

Bhatti Vikramarka: కొనసాగుతున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర...

Highlights

Bhatti Vikramarka: భట్టి చేపట్టిన పీపుల్స్ మార్చ్‌లో పాల్గొంటున్న అశేష జనం

Bhatti Vikramarka: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నాగర్‌కర్నూల్ జిల్లాలో కొనసాగుతోంది. పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో కార్నర్ మీటింగ్‌లో ఏర్పాటు చేశారు విక్రమార్క. నీళ్లు, నిధులు, నియామకాలు, తెలంగాణ లక్ష్యాలు నెరవేర్చకుండా ఆత్మీయ సభలతో ప్రజలను మరోసారి దగా చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారాయన. ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి, మద్యం, మాంసాన్ని ప్రజలకు పంచుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిందేనన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పంచిన 24 లక్షల ఎకరాల భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల నుంచి తిరిగి వెనక్కి తీసుకోవాలనుకుంటోందని ధ్వజమెత్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories