MLC Elections 2021: కొనసాగుతోన్న రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు

Ongoing 2nd Priority Votes Counting
x

ఫైల్ ఫోటో 

Highlights

MLC Elections 2021: రెండో ప్రాధాన్యతలో 76 మంది అభ్యర్ధులు ఎలిమినేషన్

MLC Elections 2021: తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల ఓట్ల లెక్కింపు మూడు రోజులుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానం ఓట్ల లెక్కింపును హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ ఇండోర్‌ స్టేడియంలో జరుగుతుండగా, వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ స్థానం ఓట్ల లెక్కింపు నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో నిర్వహిస్తున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ 50శాతం ఓట్లు దాటక పోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తున్నారు. మూడో ప్రాధాన్య ఓట్లని కూడా లెక్కించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఇవాళ రాత్రికి తుది ఫలితాలు వెలువడవచ్చని అంచనా వేస్తున్నారు.

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం ఐదు లక్షల 31 వేల 268 ఓట్లకు గాను మూడు లక్షల 58 వేల 348 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ అభ్యర్ది విజయం సాధించాలంటే 1,68 వేల 520 ఓట్లు అవసరం ఉంది. నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నికల్లో మొత్తం ఐదు లక్షల 5 వేల 565 ఓట్లకు గాను మూడు లక్షల 87 వేల 969 ఓట్లు పోలయ్యాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలఅభ్యర్ది విజయం సాధించాలంటే 1,68 వేల 520 ఓట్లు అవసరం ఉంది. అభ్యర్థి విజయం సాధించాలంటే 1,83,167 ఓట్లు అవసరం ఉంది.

హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది. ఏడు రౌండ్లలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తికాగా.. ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు 76 మంది ఎలిమినేషన్‌ ప్రక్రియ పూర్తయింది. ఇప్పటి వరకు టీఆర్ఎస్ అభ్యర్ది సురభి వాణీదేవికి ఒక లక్షా 13 వేల 725 ఓట్లు లభించగా.. బీజేపీ అభ్యర్ధి రామచందర్‌రావుకు ఒక లక్ష 5 వేల 550 ఓట్లు, ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌కు 53 వేల 315, చిన్నారెడ్డికి 32 వేల 19 ఓట్లు వచ్చాయి. అభ్యర్ది విజయం సాధించాలంటే 1,68 వేల 520 ఓట్లు అవసరం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories