Ration Card: తెలంగాణలో పాత రేషన్ కార్డులు యాథతథం-పౌరసరఫరాల శాఖ

Old ration cards in Telangana are genuine, says Civil Supplies Department
x

Ration Card: తెలంగాణలో పాత రేషన్ కార్డులు యాథతథం-పౌరసరఫరాల శాఖ

Highlights

Ration Card: తెలంగాణలో ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులు యాథతథంగా కొనసాగుతాయని పౌరసరఫరాల శాఖ తెలిపింది. కులగణన సహా కార్డులకు సంబంధించిన ఏ జాబితాలోనూ పేర్లు...

Ration Card: తెలంగాణలో ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులు యాథతథంగా కొనసాగుతాయని పౌరసరఫరాల శాఖ తెలిపింది. కులగణన సహా కార్డులకు సంబంధించిన ఏ జాబితాలోనూ పేర్లు లేనవారి నుంచి ఈనెల 21-24 వరకు జరిగే గ్రామసభల్లో కార్డుల కోసం దరఖాస్తులు తీసుకుంటామని తెలిపింది.

ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చేందుకు వచ్చిన 12, 07,558 దరఖాస్తులకు సంబంధించి 18, 055,515 మంది పేర్లను అర్హతల మేరకు చేర్చనున్నట్లు పౌరసరఫరాల శాఖ తెలిపింది. ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించనున్నట్లు పౌరసరఫరాల శాఖ శనివారంలో ఓ ప్రకటనలో వెల్లడించింది.

అటు రాష్ట్రంలో అర్హులుగా ఉన్న ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు అందేందుకు ప్రక్రియ కొనసాగుతుందని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కులగణన, సామాజిక ఆర్థిక సర్వే, పాత రేషన్ కార్డుల జాబితా ఆధారంగా..కొత్త కార్డుల జారీకి ప్రాథమిక జాబితా రూపొందించామని తెలిపారు. ఇందులో పేరులేనివారు గ్రామసభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories