తెలంగాణ అటవీ అధికారుల్లో టెన్షన్ టెన్షన్.. ఆయుధాలు ఇవ్వాలి, సిబ్బందిని పెంచాలని డిమాండ్లు

Officials demand weapons and incresing of personnel
x

తెలంగాణ అటవీ అధికారుల్లో టెన్షన్ టెన్షన్.. ఆయుధాలు ఇవ్వాలి, సిబ్బందిని పెంచాలని డిమాండ్లు

Highlights

* పోలీస్‌స్టేషన్ల మాదిరిగా ఫారెస్ట్ స్టేషన్ల ఏర్పాటు చేయాలని డిమాండ్

Forest Officers: తమకూ ఆయుధాలు కావాలంటున్నారు అటవీ అధికారులు. అంతేకాదు డిపార్ట్‌మెంట్‌లో రిక్రూట్‌మెంట్‌ కూడా చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఇవాళ్టి నుంచి విధులను బహిష్కరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు ప్రభుత్వానికి ఆల్టిమేటం ఇచ్చారు. తెలంగాణలో తీవ్ర కలకలం రేపిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌ చలమల శ్రీనివాసరావు హత్యపై అటవీ అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణాన పోడు భూములకు పట్టాలిస్తామని ప్రభుత్వం ప్రకటించిందో అప్పటి నుంచి దాడులు పెరిగాయని ఆత్మరక్షణ కోసం ఆయుధాలు ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నారు.

అటవీ భూముల్లో అధికారులు వచ్చి చెట్లను నాటడం గిరిజనులు వాటిని తొలగించి వ్యవసాయం చేయడం రాష్ట్రవ్యాప్తంగా గత కొంతకాలంగా ఇదే తంతు కొనసాగుతూ వస్తోంది. ఈ క్రమంలో గిరిజనులను కట్టడి చేసే సమయంలో అధికారులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తాజాగా ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చింది. దీంతో తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఏకరువు పెడుతున్నారు. అడవిని రక్షించే అధికారులకు వెపన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 వేల మందికి పైగానే ఫారెస్టు అధికారులు ఉన్నారు. అందులో 800 మంది సెక్షన్ ఆఫీసర్స్, 300 మంది డి ఆర్ ఓ లు, 250 మంది రేంజ్ ఆఫీసర్స్, మరికొందరు బీట్ ఆఫీసర్స్ ఉన్నారు. వీరితో పాటు ఒక్కొక్క ఏరియాని బట్టి వాచర్స్ ఉంటారు. వాచర్స్‌తో పాటు బీట్ ఆఫీసర్ కూడా ఎప్పుడూ డ్యూటీ లోనే ఉండాలి. ఈ క్రమంలో జంతువుల నుంచి కానీ, గిరిజనుల నుంచి కానీ ఎలాంటి ప్రతిఘటన ఎదురైనా ఆత్మరక్షణ కోసం ఆయుధాలు కావాల్సిందే అని పట్టుబడుతున్నారు. అంతేకాదు పోలీస్ స్టేషన్ మాదిరిగా ఫారెస్ట్ స్టేషన్ ఉంటే అటవి సంపదను కొల్లగొట్టేవారికి భయం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం నుంచి ఖండనలు తప్ప ఎలాంటి ముందడుగు పడటం లేదంటున్న ఫారెస్ట్ అధికారులు ఏపీ ప్రభుత్వాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు. అక్కడ ఎర్రచందనం స్మగ్లర్లను ఎదుర్కొనేందుకు అధికారులకు వెపన్స్ ఇచ్చిందని కానీ తెలంగాణలో మాత్రం ప్రభుత్వం అటువైపుగా ఆలోచించడం లేదని ఆరోపిస్తున్నారు. గతంలోనే ప్రభుత్వం ఆ దిశగా సరైన చర్యలు తీసుకుని ఉంటే ఇవాళ శ్రీనివాస్‌రావు హత్య జరిగి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇప్పటికే దాదాపు 4 లక్షల ఎకరాల భూ పంపిణీ అవసరం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ఇప్పటికే అటవీ అధికారులు సర్వే కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఆ సర్వే 95 శాతం పూర్తైంది కూడా. త్వరలోనే గ్రామసభలు నిర్వహించి సాగుపై ఓ నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నారు. అంతలోనే ఈ ఘటన జరగడంతో అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమకు ఆయుధాలు ఇవ్వడమే కాకుండా సిబ్బందిని పెంచాలని ఫారెస్ట్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే సర్వే కూడా నిలిపేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం విధులకు హాజరుకాబోమని తేల్చిచెబుతున్నారు. అయితే అటవీ అధికారులకు ఆయుధాలు ఇవ్వడం సాధ్యం కాదని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.

మరోవైపు ఫారెస్ట్ ఆఫీసర్ హత్యపై టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అన్న ఆయన మృతుడి కుటుంబానికి 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోడు భూముల సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్న రేవంత్‌ దీనిపై త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని సీఎం కేసీఆర్‌ను బహిరంగ లేఖ ద్వారా హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories