తెలంగాణ ఆర్టీసీ కాలగర్భంలో కలిసిపోతుందా..?

TSRTC strike
x
TSRTC strike
Highlights

-వందేళ్ల చరిత్ర ఇక పుస్తకాల్లో చదువుకోవాల్సిందేనా..? -మరికొన్ని గంటల్లో ముగియనున్న డెడ్‌లైన్‌ -పెద్దగా ఆసక్తి చూపని ఆర్టీసీ కార్మికులు -ఢీ అంటే ఢీ అంటున్న సర్కారు, ఆర్టీసీ జేఏసీ -డెడ్‌లైన్‌ ముగిస్తే.. ఆర్టీసీ మనుగడలో ఉండదా..? -ఆర్టీసీపై కేసీఆర్‌ అన్నంత పనీ చేసి చూపిస్తారా..? -మరిన్ని రూట్లను కూడా ప్రైవేటుకు అప్పగిస్తారా..? -ఈ అర్ధరాత్రితో 49 వేలకు పైగా కార్మికుల ఉద్యోగాలు ఊడినట్లేనా..?

ఈ అర్ధరాత్రి ఆర్టీసీ భవిష్యత్తు నిర్ణయించబోతోంది. చివరి అవకాశం అంటూ కార్మికులంతా విధుల్లోకి చేరాలంటూ సీఎం కేసీఆర్‌ విధించిన డెడ్‌లైన్‌ మరికాసేపట్లో ముగుస్తోంది. అయితే కేసీఆర్‌ విధించిన గడువుకు స్పందన కరువైంది. ఇప్పటివరకు పదుల సంఖ్యలో మాత్రమే కార్మికులు విధుల్లోకి చేరుతున్నట్లు సమ్మతి పత్రాలను అందజేశారు. దీంతో ఆర్టీసీ మనుగడపైనే అందరి దృష్టి పడింది. మరి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పినట్లుగానే.. ఈ అర్ధరాత్రి తర్వాత ఆర్టీసీ సంస్థ కాలగర్భంలో కలిసిపోతుందా..? రేపటి నుంచి మనుగడలో ఉండదా..? ఇప్పుడివే ప్రశ్నలు సమాధానం కోసం వేచిచూస్తున్నాయి.

కార్మికులు విధులకు చేరకపోవడం.. తమ ఐక్యతకు నిదర్శనమంటున్న ఆర్టీసీ జేఏసీ సమ్మె నుంచి వెనక్కి తగ్గేదే లేదంటూ సర్కారుతో ఢీ అంటే ఢీ అంటోంది. దీంతో ఆర్టీసీ విషయంలో కేసీఆర్‌ అన్నంత పనిచేస్తారా..? 49 వేలకు పైగా కార్మికుల ఉద్యోగాలు పోతాయా..? ఇప్పటికే 5 వేలకు పైగా రూట్లను ప్రైవేటుకు అప్పగిస్తున్నామంటూ మొన్నటి కేబినేట్‌ మీటింగ్ తర్వాత ప్రకటించిన కేసీఆర్‌.. విధులకు హాజరుకాకపోతే.. ఈ అర్ధరాత్రి తర్వాత అన్ని రూట్లను ప్రైవేటుకు అప్పగిస్తామని తేల్చిచెప్పారు. మరి కేసీఆర్‌ తన మాటకు కట్టుబడతారా..? ఆర్టీసీ రహిత రాష్ట్రంగా తెలంగాణ మారుతుందా..? చూడాల్సిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories