హుజూర్‌నగర్‌ ఉపఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల

హుజూర్‌నగర్‌ ఉపఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల
x
Highlights

హుజూర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది.సోమవారం నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబర్‌ 1న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్‌ 3 వరకు ఉపసంహరణ జరగనుంది. అక్టోబర్‌ 21న పోలింగ్‌ నిర్వహించి.. 24వ తేదీన కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తి చేయనున్నారు

హుజూర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది.సోమవారం నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబర్‌ 1న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్‌ 3 వరకు ఉపసంహరణ జరగనుంది. అక్టోబర్‌ 21న పోలింగ్‌ నిర్వహించి.. 24వ తేదీన కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఈ మేరకు అధికారులు హుజూర్‌నగర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు.

హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చెయ్యడం తో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి పేరును ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతిని అభ్యర్థిగా దింపనుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ఆటు కాంగ్రెస్ , సీటు తమ ఖాతాలో వేసుకోవడానికి టీఆర్ఎస్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీ కూడా గట్టి అభ్యర్థిని రంగంలోకి దింపాలని యోచిస్తోంది.

ఇప్పటికే కాంగ్రెస్ టీఆర్ఎస్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తుంది. టీఆర్ఎస్ అభ్యర్థి ఆంధ్రాకు చెందిన వ్యక్తి అంటూ కాంగ్రెస్ నాయకులు కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. అయితే కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మరో అభ్యర్థిని ప్రకటిస్తున్నాని చెప్పడంపై కోమటి రెడ్డితో సహా పలువురు నేతలు అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories