Telangana: సత్తుపల్లి మున్సిపాలిటీ లో నామినేషన్లు

Telangana: సత్తుపల్లి మున్సిపాలిటీ లో నామినేషన్లు
x
Highlights

సత్తుపల్లి: మున్సిపాలిటీకి మూడోసారి మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్...

సత్తుపల్లి: మున్సిపాలిటీకి మూడోసారి మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. సత్తుపల్లి పట్టణంలో రిటర్నింగ్ అధికారులు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. సత్తుపల్లి పట్టణంలో మొత్తం ఇరవై మూడు వార్డులకు గానూ ప్రతి మూడు వార్డులకు ఒక రిటర్నింగ్ అధికారిని నియమించారు.

రెండవ వార్డుకు బీజేపీ అభ్యర్థి చంద్రకళ నామినేషన్ దాఖలు చేయగా, 22 వ వార్డు తెరాస అభ్యర్థి శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేశారు. సత్తుపల్లి మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం ఎనిమిది మంది రిటర్నింగ్ ఆఫీసర్లను అధికారులు నియమించారు. ప్రతిరోజు ఉదయం పదిన్నర గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రిటర్నింగ్ అధికారులు అభ్యర్థుల నుండి నామినేషన్లను స్వీకరిస్తారు. 11వ తేదీన నామినేషన్ల పరిశీలన, 12 న పరిశీలన లో వచ్చిన అభ్యంతరాలపై జిల్లా ఎలక్షన్ అధికారి కి అప్పీలు, 13న అభ్యంతరాలపై వచ్చిన అప్పీ ల పరిష్కారం, 14 సాయంత్రం మూడు గంటల లోగా నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం, అదే రోజు మూడు గంటల తర్వాత పోటీ లో ఉన్న అభ్యర్థుల జాబితాను అధికారులు వెల్లడిస్తారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories