No Lockdown in Telangana: రాష్ట్రంలో లాక్ డౌన్ విధించే అవకాశం లేదు: సీఎం కేసీఆర్

No Lockdown in Telangana
x

సీఎం కేసీఆర్ (ఫొటో ట్విట్టర్)

Highlights

No Lockdown in Telangana: తెలంగాణలో లాక్‌డౌన్ విధించే అవకాశం లేదని మరోసారి కేసీఆర్ స్పష్టం చేశారు.

No Lockdown in Telangana: తెలంగాణలో లాక్‌డౌన్ విధించే అవకాశం లేదని మరోసారి కేసీఆర్ స్పష్టం చేశారు. కోవిడ్ నుంచి కోలుకున్నాక నేడు ప్రగతిభవన్ చేరుకుని అధికారులతో ప్రస్తుత పరిస్థితులపై సీఎం చర్చించారు. కేసులు జూన్ వరకు తగ్గుముఖం పడతాయని, అప్పటి వరకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

అలాగే రాష్ట్రానికి రావాల్సిన వ్యాక్సిన్లు , ఆక్సిజన్ , రేమిడిసివర్ సరఫరా పై ప్రధాని తో ఫోన్ లో మాట్లాడారు. తెలంగాణలో 50శాతం ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉండటం వలన మందుల లభ్యత ఎక్కువగా కావాలని పీఎంను కోరారు.

ప్రస్తుతం 440 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను 500 మెట్రిక్ తన్నులకు పెంచాలని, తెలంగాణ లో రోజుకు 4900 రేమిడిసివర్ మాత్రమే అందుబాటులో ఉన్నందున వాటిని 25000 కు పెంచాలని ప్రధాని నరేంద్రమోదీ ని సీఎం కేసీఆర్ కోరారు. ఇప్పటివరకు 50 లక్షల డోసులు ఇచ్చినందున రోజూ సగటున 2 నుంచి 2.5 లక్షలు అవసరం పడుతుందని.. తక్షణమే సరఫరా చేయాలని ఈ సందర్భంగా ప్రదానికి కేసీఆర్ విన్నవించారు. అలాగే రాష్ట్రానికి వివిధ అవసరాల నిమిత్తం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తోనే సీఎం మాట్లాడారు.

Show Full Article
Print Article
Next Story
More Stories