కోడి మాంసం తినరు.. కోడిని కూడా సాదుకోరు

కోడి మాంసం తినరు.. కోడిని కూడా సాదుకోరు
x
Highlights

ప్రతీ పల్లేటూల్లో ప్రజలు నిద్రలేచేది కోడికూతతోనే కోడి కూతవినని గ్రామం, అసలు కోడే కనిపించని గ్రామం ఉంటుందా..? అంటే ఖచ్చితంగా ఉండదనే అంటాం. కాని ఆ...

ప్రతీ పల్లేటూల్లో ప్రజలు నిద్రలేచేది కోడికూతతోనే కోడి కూతవినని గ్రామం, అసలు కోడే కనిపించని గ్రామం ఉంటుందా..? అంటే ఖచ్చితంగా ఉండదనే అంటాం. కాని ఆ గ్రామంలో మాత్రం కోడి కూతే కాదూ అసలు ఒక్క కోడి కూడా దర్శనమివ్వదు. అంతేకాదు కోడికూర, కొడిగుడ్డు, చివరకు చేపను సైతం ఆ గ్రామంలోని ఏ ఒక్కరూ తినరు. కోడి అంటే ఆ గ్రామానికి ఎందుకు ఇష్టం ఉండదు వనపర్తి జిల్లాలోని కోడికూయని గ్రామంపై హెచ్ ఎంటీవి ప్రత్యేక కథనం.

వనపర్తి జిల్లా పబ్బేరు మండలం కంచిరావుపల్లి తండాలో కోడికూత వినపడదు కదా చూడ్డానికైనా ఒక్క కోడి పిల్ల కనిపించదు. ఇక ఈ తండా వాసులు ఎన్నో ఎళ్ల నుంచి కొన్ని ఆచారాలు పాటిస్తున్నారు. మొత్తం 80 కుటుంబాలు కల్గి ఉన్న ఈ తండాలో సోమసాత్ గురూజీ మాటలకు కట్టుబడి జీవనం సాగిస్తున్నారు. గ్రామస్తులు కోడి మాంసం తినడం కాదు కదా కనీసం కోడిని కూడా ఎవరూ సాదుకోరు. ఇంకా చెప్పాలంటే చేపను సైతం తినకుండా గురూజీ చెప్పిన సూక్తిని పాటిస్తున్నారు.

కంచిరావుపల్లిలో సోమసాత్ గురూజీ ఓ కోడిని కుటుంబంలో ఒకటిలా చూసుకుంటుండే వారు. అలాంటి కోడి ఓ రోజు గురూజీ నోట్ల నుంచి పడిన ఉమ్మి తినడంతో అప్పటి నుంచి కోళ్లను పెంచడం మానేసినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఆనాటి నుంచి నేటికి ఊళ్లో కోళ్లపెంపకం గుడ్లు, కోళ్ల మాసం తినకూడదన్న గురుజీ మాటకు కట్టుబడి ఆచారం పాటిస్తున్నారు గ్రామస్థులు. అంతే కాదు చేపలు కూడా తాము తినబోమని చెబుతున్నారు గ్రామస్తులు.

ప్రతి ఇంట రెండు, మూడు మేకలు మాత్రం పెంచుకోవడం ఆనవాయితీగా పాటిస్తున్నారు ఈ తండావాసులు. ఈ మేకలను గ్రామదేవతగా భావించే పోచమ్మ తల్లికి మాత్రమే బలిదానం చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. గ్రామంలోనే కాదు బంధువుల ఇళ్లలో జరిగే కార్యక్రమాలకు వెళ్లినా గ్రామ ఆచారాలానే పాటిస్తామని చెబుతున్నారు స్థానికులు. సోమాసాత్ గురూజీ చెప్పిన ఆచారా వ్యవహరాలను పాటిస్తున్న కాచరావుపల్లి తండా నేటికి పాడి పంటలు పచ్చదనంతో కళకళలాడుతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories