Jagtial: మున్సిపాలిటీ ఛైర్మన్‌ శ్రీనివాస్‌పై కౌన్సిలర్ల అవిశ్వాస తీర్మానం

No Confidence In Jagtial Municipal Chairman
x

Jagtial: మున్సిపాలిటీ ఛైర్మన్‌ శ్రీనివాస్‌పై కౌన్సిలర్ల అవిశ్వాస తీర్మానం

Highlights

Jagtial: ఛైర్మన్ ఎన్నిక మళ్లీ నిర్వహించాలని కోరిన కౌన్సిలర్లు

Jagtial: జగిత్యాల మున్సిపాలిటీ ఛైర్మన్‌పై అవిశ్వాసం బయటపడింది. ఇన్‌చార్జ్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్‌పై కౌన్సిలర్లు అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెడుతూ జగిత్యాల అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అయితే మొదట బీఆర్ఎస్‌కు చెందిన బోగ శ్రావణి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా కొనసాగింది. ఏడాదిక్రితం ఆమె బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో ఆమె స్థానంలో వైస్‌ఛైర్మన్‌గా ఉన్న గోలి శ్రీనివాస్‌కు ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు. అయితే ఆయనను తొలగించి ఛైర్మన్ ఎన్నిక నిర్వహించాలని కోరుతూ కౌన్సిలర్లు అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories