Top
logo

యూరియా కొరత వెనక టీఆరెస్ కుట్ర?

యూరియా కొరత వెనక టీఆరెస్ కుట్ర?
Highlights

కేసీఆర్‌ ప్రభుత్వం నిజామాబాద్ రైతులపై కక్ష్య గట్టిందని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. తెలంగాణ...

కేసీఆర్‌ ప్రభుత్వం నిజామాబాద్ రైతులపై కక్ష్య గట్టిందని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి ఎంత అవసరమో అంతకంటే ఎక్కువ యూరియా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని బీజేపీ ఎంపీ అరవింద్ అన్నారు. నిజామాబాద్‌లో 55 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే దానికి తగ్గట్లుగా సరఫరా చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే యూరియా సమస్యను పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్‌ ఫామ్‌ హౌజ్‌కే పరిమితం అయ్యారని, జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించలేదనే కక్ష్య సాధింపుతోనే ఎరువులు ఇవ్వడం లేదని ఎంపీ అర్వింద్‌ దుయ్యబట్టారు.


లైవ్ టీవి


Share it
Top