నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల వాయిదా

X
Highlights
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం మరోమారు పొడిగించింది.
Samba Siva Rao22 May 2020 3:37 PM GMT
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం మరోమారు పొడిగించింది. కరోనా వ్యాప్తి కారణంగా ఎన్నికల్లో ప్రక్రియ గతంలోనే ప్రారంభమైనప్పటికీ ముందుకు సాగలేదు. తాజాగా మరో 45 రోజుల పాటు ప్రక్రియను ఎన్నికల సంఘం పొడిగించింది.ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి లేఖ అందినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ తెలిపారు.
నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మార్చి 12న రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 7వ తేదీన పోలింగ్ జరగాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించడంతో ఎన్నికల సంఘం ఉపఎన్నిక ప్రక్రియను పొడిగించింది.
Web TitleNizamabad Local body MLC elections postponed
Next Story