నిజామాబాద్ జిల్లా అదనపు జడ్జి శ్రీనివాసరావు సంచలన తీర్పు

Nizamabad District Additional Judge Srinivasa Rao Sensational Judgment
x

నిజామాబాద్ జిల్లా అదనపు జడ్జి శ్రీనివాసరావు సంచలన తీర్పు

Highlights

Nizamabad: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు అండగా తీర్పు

Nizamabad: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు అండగా నిజామాబాద్ జిల్లా అదనపు జడ్జి శ్రీనివాస్ రావు సంచలన తీర్పు వెలువరించారు. బాల్కొండ ప్రాంత రైతులకు తగిన నష్టపరిహారం ఇవ్వని కారణంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆస్తులను జప్తు చేయాలని సంచలన తీర్పు వెల్లడించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన బాల్కొండ ప్రాంత రైతులు తమకు నష్ట పరిహారం ఇవ్వాలని 2012 ఆగస్టు 13న నిజామాబాద్ కోర్టును ఆశ్రయించారు. బాధితులకు 62 లక్షల 85 వేల 180 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే 24 అక్టోబర్ 2019లో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 51 లక్షల 13 వేల 350 రూపాయలు మాత్రమే అధికారులు కోర్టులో జమ చేశారు. తిరిగి మిగితా నష్టపరిహారం కోసం బాధితులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పును అమలు చేయనందున జిల్లా కలెక్టరేట్ ఆస్తులను జప్తు చేయాలని నిజామాబాద్ జిల్లా అదనపు జడ్జి శ్రీనివాసరావు తీర్పునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories