Nizamabad: విద్యార్థి ఆత్మహత్యపై కలెక్టర్‌ సీరియస్‌.. నలుగురి సస్పెన్షన్‌

Nizamabad: విద్యార్థి ఆత్మహత్యపై కలెక్టర్‌ సీరియస్‌.. నలుగురి సస్పెన్షన్‌
x

Nizamabad: విద్యార్థి ఆత్మహత్యపై కలెక్టర్‌ సీరియస్‌.. నలుగురి సస్పెన్షన్‌

Highlights

Nizamabad: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య ఘటనపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు.

Nizamabad: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య ఘటనపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఘటనను సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి గిరిజన సంక్షేమ గురుకులాల ఆర్సీవో గంగారాం నేతృత్వంలో ఇతర ఏకలవ్య పాఠశాలల ప్రిన్సిపాళ్లు శ్రీనివాస్ స్వామి, డా.సైదా జైనబ్, ఫణి కుమార్, డా. జ్యోతి బృందంతో ప్రాథమిక విచారణ చేయించారు. వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రిన్సిపల్ రమేష్ కుమార్‌తో పాటు హౌస్ మాస్టర్ కుల్దీప్ యాదవ్, వార్డెన్ విశ్వంబర్, మెస్ ఇన్ఛార్జి ఆకాష్ యాదవ్‌లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

అనంతరం పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. స్కూల్ విద్యార్థి ఆత్మహత్య ఘటన తనను కలచివేసిందని కలెక్టర్ బాధను వ్యక్తం చేశారు. జీవితంలో ఎన్ని సమస్యలున్నా.. ధైర్యంగా ఎదుర్కోవాలని, చెడు ఆలోచనలు చేయొద్దని విద్యార్థులకు సూచించారు. ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకొని.. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చొద్దని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories