18 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా చూపించి ఓటు వేయవచ్చు: కలెక్టర్ సి. నారాయణ రెడ్డి

18 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా చూపించి ఓటు వేయవచ్చు: కలెక్టర్ సి. నారాయణ రెడ్డి
x
Highlights

మున్సిపల్ ఎన్నికలలో, ఓటర్ స్లిప్ తో పాటు ఎన్నికల కమిషన్ సూచించిన 18 రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒక దానిని చూపి, ఓటు వేయవచ్చని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

నిజామాబాద్: మున్సిపల్ ఎన్నికలలో, ఓటర్ స్లిప్ తో పాటు ఎన్నికల కమిషన్ సూచించిన 18 రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒక దానిని చూపి, ఓటు వేయవచ్చని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల యంత్రాంగం పంపిణీ చేసిన ఓటర్ స్లిప్ తో పాటు, ఓటర్ గుర్తింపు కార్డును ఓటు వేసే పౌరులు వెంట తీసుకు రావాలని, ఒకవేళ ఓటరు గుర్తింపు కార్డు లేకుంటే ప్రత్యామ్నాయంగా మరో 18 గుర్తింపు కార్డులలో దేనినైనా, ఓటర్ స్లిప్పు తో పాటు వెంట తీసుకువచ్చి, ఎన్నికల సిబ్బందికి చూపించాలని కలెక్టర్ తెలిపారు.

వీటిలో..

♦ ఆధార్ కార్డు,

♦ పాస్ పోర్టు,

♦ డ్రైవింగ్ లైసెన్సు,

♦ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలలో పనిచేసే ఉద్యోగులకు, వారి యాజమాన్యాలు జారీచేసిన ఫోటోతో కూడిన గుర్తింపు కార్డు,

5.ప్రభుత్వ రంగ బ్యాంకులు, సహకార బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు జారీచేసిన ఫోటో తో కూడిన పాసుబుక్కులు,

♦ ఆదాయపన్ను గుర్తింపు కార్డు లేదా పాన్ కార్డు,

♦ ఆర్ జి ఐ జారీచేసిన స్మార్ట్ కార్డులు,

♦ ఎన్నికల నోటిఫికేషన్ రోజు వరకు జారీచేసిన ఉపాధి హామీ జాబ్ కార్డ్,

♦ ఎన్నికల నోటిఫికేషన్ వరకు జారీ చేసిన కార్మిక మంత్రిత్వ శాఖ హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్,

♦ ఫోటో తో కూడిన ఎక్స్ సర్వీస్ మెన్ లేదా వితంతు పెన్షన్ బుక్,

♦ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు సంబంధిత సచివాలయం ద్వారా జారీచేసిన ఫోటో తో కూడిన గుర్తింపు కార్డులు,

♦ ఫోటో ఉన్న రేషన్ కార్డులు,

♦ ఎన్నికల నోటిఫికేషన్ వరకు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధిత అధికారులు జారీచేసిన ఫోటోతో కూడిన ధ్రువ పత్రాలు,

♦ ఫోటో తో కూడిన స్వాతంత్ర సమరయోధుల గుర్తింపు కార్డు,

♦ ఫోటో కలిగిన ఆయుధాల లైసెన్స్,

♦ ఫోటో తో కూడిన శారీరక అంగవైకల్య ధ్రువ పత్రము,

♦ పార్లమెంట్ సభ్యులకు ఆయా సచివాలయాలు జారీచేసిన గుర్తింపు కార్డులు,

♦ ఎన్నికల నోటిఫికేషన్ రోజు వరకు జారీచేసిన ఫోటోతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలలో ఏదైనా ఒక దానిని చూపి, ఓటు వేయవచ్చునని కలెక్టర్ సూచించారు.

ఎన్నికల సిబ్బంది, అధికారులు ఈ కార్డులను పరిశీలించి ఓటింగుకు అనుమతించాలని, అదేవిధంగా ఓటర్ ను గుర్తించగలిగితే చిన్న చిన్న తేడాలను పట్టించుకోవద్దని కలెక్టర్ ఆ ప్రకటనలో ఆదేశించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories