Nizamabad: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా కల్లోలం

Nizamabad: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా కల్లోలం
x
Highlights

Nizamabad: వైద్యునికి కరోనా వచ్చినా.. ఆయన రోగులకు వైద్యం అందించడం కలకలం సృష్టించింది.

Nizamabad: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఆల్ టైం రికార్డు స్దాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే కొందరు ఈ కొవిడ్‌ కాలాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. సగటు మధ్యతరగతి వారి భయంతో బంతాట ఆడుకుంటున్నారు. ఆరోగ్యం కుదటపడేందుకు జనాలు ఎంత ఖర్చైనా వెనుకాడరు. అందుకే వైరస్‌ సోకినా.. ఐసోలేషన్‌లో ఉండకుండా రోగులకు పరీక్షలు చేస్తున్నారు కొందరు వైద్యులు.

వైరస్ వ్యాప్తికి ప్రైవేట్ వైద్యుల నిర్లక్ష్యమే...

జిల్లాలో కరోనా సెకండ్‌ వేవ్‌ వ్యాప్తి వేగంగా జరగడానికి ప్రైవేట్ వైద్యుల నిర్లక్ష్యమే కారణమనే విమర్శలు వెలువెత్తాయి. జిల్లా కేంద్రంలోని.. ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యునికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. వైద్యునికి కరోనా వచ్చినా.. ఆయన రోగులకు వైద్యం అందించడం కలకలం సృష్టించింది. ఆసుపత్రిలో వైద్యునితో పాటు సగానికి పైగా సిబ్బందిలో లక్షణాలు ఉన్నట్లు ఫిర్యాదులు అందడంతో.... వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆసుపత్రిపై దాడి చేశారు 30 మంది సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా 10 మందికి పాజిటివ్‌గా తేలింది. డాక్టర్‌కు కూడా పరీక్ష నిర్వహించబోగా పారిపోయాడని జిల్లా వైద్యాధికారి తెలిపారు. రెండు గంటలు వేచి చూసినా డాక్టర్‌ రాకపోవడంతో ఆస్పత్రిని తాత్కాలికంగా సీజ్‌ చేశారు.

వైద్యుడి తీరుపై అధికారులు సీరియస్‌...

వైద్యుడి తీరును జిల్లా కలెక్టర్ సైతం సీరియస్ గా తీసుకుంది. ఐఎంఏ సైతం సదరు వైద్యుని నిర్వాకం తీరుపై గుర్రుగా ఉంది. ఇలాంటి పనుల వల్ల కరోనా వారియర్స్ గా పేరుతెచ్చుకున్న ఎంతో మంది వైద్యులకు ఇబ్బందిగా మారింది. కరోనా కేసులు పెరుగుతున్నతరుణంలో.. ప్రతి ఒక్కరు బాధ్యతగా మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories