Niranjan Reddy: కాంగ్రెస్‌కి తెలంగాణలో పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువయ్యారు

Niranjan Reddy Comments On Congress
x

Niranjan Reddy: కాంగ్రెస్‌కి తెలంగాణలో పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువయ్యారు

Highlights

Niranjan Reddy: బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలకే ఎక్కువ టికెట్లు కట్టబెట్టారు

Niranjan Reddy: దేశంలో అతిపెద్ద పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి... తెలంగాణాలో పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువై... బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలకే ఎక్కువ శాతం టికెట్లు కట్టబెట్టారన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. తాను బీఫామ్ ఇస్తే ఎంపీపీగా పోటీ చేసిన వ్యక్తిని, నేడు తనపై పోటీకి కాంగ్రెస్ పార్టీ బరిలో నిలపడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

వనపర్తిలో తనకు సరైన ప్రత్యర్థి మాజీ మంత్రి చిన్నారెడ్డినే అని అన్నారు. ఇప్పటివరకు అన్ని రంగాల్లో వనపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని, మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నానన్నారు. అభివృద్ధిని ఆకాంక్షించే వనపర్తి నియోజకరవర్గ ప్రజలు మరోసారి తనను భారీ మెజార్టీతో గెలిపిస్తారంటున్న వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి నిరంజన్‌రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories