హన్మకొండ చిన్నారి అత్యాచారం కేసు : దోషికి శిక్ష తగ్గించిన హైకోర్టు

దోషి ప్రవీణ్ కు ఉరిశిక్షను యావజ్జీవ శిక్ష
x
దోషి ప్రవీణ్ కు ఉరిశిక్షను యావజ్జీవ శిక్ష
Highlights

-51 రోజుల్లో విచారణ పూర్తి చేసి ఉరిశిక్ష విధించిన వరంగల్ కోర్టు -దోషి ప్రవీణ్ కు ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చిన హైకోర్టు

వరంగల్‌ జిల్లా హన్మకొండలో తొమ్మిది నెలల బాలికపై అత్యాచారం, హత్య చేసిన కామాంధుడికి వరంగల్ జిల్లా కోర్టు విధించిన ఉరి శిక్షను యావజ్జీవ శిక్షగా తగ్గిస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించింది. నిందితుడు ప్రాణం ఉన్నంత వరకూ జైలు శిక్ష అనుభవించాలని హైకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. చిన్నారిపై అత్యాచారం చేసిన ప్రవీణ్‌ అలియాస్‌ పవన్‌కు వరంగల్ కోర్టు ఉరి శిక్ష విధించింది. దోషి ప్రవీణ్‌ హైకోర్టులో క్రిమినల్‌ అప్పీల్‌ దాఖలు చేశాడు. విచారించిన ధర్మాసనం క్రిమినల్‌ అప్పీల్‌ను పాక్షికంగా అనుమతిస్తూ తీర్పును వెలువరించింది. పిల్లల సంరక్షణ ప్రత్యేక కోర్టు విధించిన ఉరి శిక్షను యావజ్జీవ శిక్షగా తగ్గించింది.

హన్మకొండలో జూన్ 18వ తేదీన తల్లిఒడిలో నిద్రిస్తున్న చిన్నారిని అపహరించిన ప్రవీణ్ నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. పాప ఎడవడంతో నోరు, ముక్కు మూసి హతమార్చాడు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు 20 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేశారు. నిందితుడిపై అపహరణ, అత్యాచారం, హత్య నేరాలతో పాటు లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం కింద కేసులు నమోదు చేశారు. 51 మంది సాక్షుల్లో 30 మందిని విచారించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన ప్రవీణ్ కు ఉరేసరి అంటూ వరంగల్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories