నిత్యపెళ్లికూతురు గుట్టు రట్టు.. తొమ్మిది పెళ్లిళ్లు చేసుకుని తొమ్మిదో భర్తకు చిక్కిన ఖిలాడీ..

Mahabubabad: మహబూబాబాద్‌లో నిత్యపెళ్లి కూతురు గుట్టు రట్టు

Rama Rao
Updated on: 22 Jun 2022 5:12 PM IST
Nine Married Girl in Mahabubabad | TS News
X

Mahabubabad: తొమ్మిది పెళ్లిళ్లు చేసుకుని తొమ్మిదో భర్తకు చిక్కిన ఖిలాడీ

Mahabubabad: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా తొమ్మిది పెళ్లిళ్లు చేసుకుని తొమ్మిదో భర్తకు దొరికింది పెళ్ళిళ్ల ఖిలాడీ. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళ పెళ్లి సంబంధాలకు సంబంధించిన మ్యాట్రిమోనీ సైట్‌లో ఆంధ్రా అబ్బాయికి పరిచయమైంది. ఆ పరిచయం కాస్త పెళ్లికి దారి తీసింది. ఆ అమ్మాయి తన పెళ్లి సంబంధం కుదర్చుకునేందుకు తమ ఇంటిల్లిపాదిని వెంటబెట్టుకుని ఆంధ్రాలోని అబ్బాయి ఇంటికి వెళ్లి సంబంధం మాట్లాడుకున్నారు.

2018లో పెళ్లి చేసుకున్న ఈ నవ దంపతులు రెండు నెలలు మాత్రమే కాపురం చేశారు. ఈ రెండు నెలల కాలంలో ఆ అమ్మాయి తరుచూ ఫోన్‌లో మాట్లాడుతూ, కోర్టు విషయాలలో తలమునకలై ఉండేదని, ఏంటని భర్త ప్రశ్నిస్తే తనతో గొడవలకు దిగేదని భర్త చెబుతున్నాడు. ఓ రోజు బెంగుళూరు నుంచి ఆకస్మాత్తుగా హైదరాబాద్ వెళ్లాలని పట్టుబడిందని వెళ్లి వచ్చిన తర్వాత మళ్లీ వెళ్లాలని అనడంతో అనుమానం వచ్చి భర్త ఆరా తీశాడు. దీంతో ఆమె చేసిన తతంగమంతా బయటపడింది.

ఎనిమిది పెళ్లిళ్లు చేసుకుని తొమ్మిదో పెళ్లి తనను చేసుకుందని, తనకు విడాకులు కావాలని భర్త కోరాడు. దీంతో భర్త తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ మహబూబాబాద్ టౌన్ పోలీసు స్టేషన్ ముందు మహిళ బైఠాయించింది. దీంతో నివ్వెరపోయిన భర్త ఆమె చేసుకున్న వివాహాల గురించి చిట్టా విప్పాడు. ఎప్పుడు ఏ సంవత్సరంలో ఎవరిని పెళ్లి చేసుకుంది.? ఎంత డబ్బులు కొట్టేసింది? అనే వివరాలను బయటపెట్టాడు. ఈ విషయం కాస్త జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ దృష్టికి తీసుకెళ్లగా టౌన్ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చే పనిలో పడ్డారు.


Rama Rao

Rama Rao

Next Story