NGT: తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ భారీ జరిమానా

NGT Heavy Fine for Telangana Govt
x

NGT: తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ భారీ జరిమానా

Highlights

NGT: వ్యర్థాల నిర్వహణలో మార్గదర్శకాలు, తీర్పులు అమలు చేయకపోవడంతో జరిమానా

NGT: తెలంగాణ సర్కార్‌కు జాతీయ హరిత ట్రైబ్యునల్ భారీ జరిమానా విధించింది. వ్యర్థాల నిర్వహణలో మార్గదర్శకాలు, తీర్పులు అమలు చేయకపోవడంపై 3వేల 800 కోట్ల రూపాయల జరిమానా వేసింది. రెండు నెలల్లో ఈ మొత్తాన్ని స్పెషల్ అకౌంట్‌లో జమ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వ్యర్థాల నిర్వహణపై చర్యలు తీసుకుని... పురోగతి తెలుపాలని పేర్కొంది. 1996లో మున్సిపాలిటీల్లో పారిశుధ్య , వ్యర్థాల నిర్వహణ సరిగా లేదని పర్యావరణ సురక్షా స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఎన్.జీ.టీకి బదిలీ చేసింది. పిటిషన్‌పై విచారించిన ట్రైబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories