Top
logo

సాప్ట్‌వేర్ ఇంజినీర్‌ సతీష్‌ హత్య కేసులో కొత్త కోణాలు..

సాప్ట్‌వేర్ ఇంజినీర్‌ సతీష్‌ హత్య కేసులో కొత్త కోణాలు..
X
Highlights

సంచలనం సృష్టించిన కూకట్ పల్లిలో సాప్ట్‌వేర్ ఇంజినీర్‌ సతీష్‌ హత్య కేసులో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి....

సంచలనం సృష్టించిన కూకట్ పల్లిలో సాప్ట్‌వేర్ ఇంజినీర్‌ సతీష్‌ హత్య కేసులో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. సతీష్‌ మద్యం తాగి హేమంత్‌ ఇంటికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు ముందు రోజు స్నేహితురాలు ప్రియాంకను సతీష్‌ హాస్టల్‌ దగ్గర వదిలేసినట్లు దర్యాప్తులో తేలింది. తర్వాత సతీష్‌ ఎక్కడికి వెళ్లాడన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హేమంత్ స్నేహితురాలు ప్రియాంకతో సతీష్‌కు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా సతీష్‌ కుటుంబ సభ్యులు మాత్రం హత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణాలని చెబుతున్నారు. కాగా సతీష్ ను హత్య చేసేందుకు.. హేమంత్‌కు ఎవరు సాయపడ్డారన్న కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

Next Story