కొత్త రేషన్ కార్డులు, పౌరసరఫరాల శాఖకు కేటాయింపులపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి ప్రకటన

Mallu bhatti vikramarka budget speech and How to apply for new ration cards in Telangana
x

కొత్త రేషన్ కార్డులు, పౌరసరఫరాల శాఖకు కేటాయింపులపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి ప్రకటన

Highlights

New ration cards distribution in Telangana : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎంతో మంది పేదలు కొత్త రేషన్ కార్డుల కోసం వేచిచూసినా గత ప్రభుత్వం వారిని...

New ration cards distribution in Telangana : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎంతో మంది పేదలు కొత్త రేషన్ కార్డుల కోసం వేచిచూసినా గత ప్రభుత్వం వారిని పట్టించుకోలేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోగా కనీసం కొత్తగా చేరిన కుటుంబసభ్యుల పేర్లను కూడా చేర్చలేదని భట్టి విక్రమార్క గుర్తుచేశారు.

రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల ఆకాంక్షలను గుర్తించి అర్హులైన అందరికీ రేషన్ కార్డు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే ఈ ఏడాది జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డుల పంపీణీ ప్రారంభించినట్లు తెలిపారు. అలాగే అదనపు కుటుంబసభ్యుల పేర్లను చేర్చే ప్రక్రియ కూడా ప్రారంభించామని అన్నారు.

కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. అందుకోసం ఈ ఏడాది బడ్జెట్ లో పౌరసరఫరాల శాఖకు రూ. 5734 కోట్లు ప్రతిపాదించినట్లు చెప్పారు.

ఈ వార్త అప్‌డేట్ అవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories