తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల చిచ్చు!

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల చిచ్చు!
x
Highlights

ఇటీవల కాలంలో కలిసిమెలసి ఉన్న తెలుగు రాష్ట్రాల మధ్య అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మొన్నటి వరకు గోదావరి నీటి వాటాపై చర్చించుకున్న తెలుగు ముఖ్యమంత్రుల...

ఇటీవల కాలంలో కలిసిమెలసి ఉన్న తెలుగు రాష్ట్రాల మధ్య అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మొన్నటి వరకు గోదావరి నీటి వాటాపై చర్చించుకున్న తెలుగు ముఖ్యమంత్రుల మధ్య కృష్ణా జలాల తరలింపు అంశం చిచ్చు పెట్టింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజూ 3 టీఎంసీలకు పైగా నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తలపెట్టిన ఎత్తిపోతల పథకంపై తెలంగాణ సర్కార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ప్రాజెక్ట్‌ను అడ్డుకుని తీరుతామని ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగకరమని పేర్కొన్నారు. ఈ విషయంలో రాజీలేని ధోరణి అవలంభిస్తామన్న కేసీఆర్‌ ప్రాజెక్ట్‌ను అడ్డుకోవడమే లక్ష్యంగా న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల మంత్రులతోపాటు ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, అడ్వకేట్‌ జనరల్‌తో సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. అపెక్స్‌ కమిటీ ఆమోదం లేకుండా ఏపీ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టును తలపెట్టడం అంటే రాష్ట్ర విభజన చట్టాన్ని ఉల్లంఘించడమే అని కేసీఆర్ అన్నారు. దీనిపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డులో ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా కృష్ణా జలాల వాటాను తేల్చేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని కేసీఆర్ తేల్చిచెప్పారు.

ఈ పరిణామంతో ఇరు రాష్ట్రాల మధ్య జలజగడం మొదలైందనే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని సంప్రదించకుండానే ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం నీటి విషయంలో నిర్ణయం తీసుకోవడం, అపెక్స్ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టడం ఆ రాష్ట్రం చేసిన తప్పిదాలుగా కేసీఆర్ పేర్కొన్నారు. కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతే ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగు నీటి సమస్య ఏర్పడుతుందని అందుకే ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగకుండా ఆదేశాలు జారీ చేయాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డును ఆశ్రయించాలని అధికారులను ఆదేశించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories