YS Sharmila: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వైఎస్ షర్మిల పాదయాత్ర..!

* స్థానిక ఎమ్మెల్యేలపై షర్మిల విమర్షనాస్త్రాలు

R Tripura Malini
Published on: 11 Nov 2022 8:39 AM IST
new enthusiasm in ysrtp cadre with sharmila padayatra
X

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వైఎస్ షర్మిల పాదయాత్ర

YS Sharmila: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విజయవంతంగా కొనసాగింది. రెండు విడతల్లో తూర్పు జిల్లాలో చేపట్టిన పాదయాత్రకు జనం నుంచి మంచి స్పందన వచ్చింది. షర్మిల పాదయాత్రలో రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులపై ఘాటైనా విమర్శలతో సాగిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో షర్మిల పాదయాత్ర మొదటి విడతలో నిర్మల్ జిల్లా బాసర నుండి ప్రారంభమైంది. ముధోల్, నిర్మల్, ఖానాపూర్ నియోజకవర్గాలు, జగిత్యాల జిల్లా మీదుగా మంచిర్యాల జిల్లాలోకి ప్రవేశించింది. మంచిర్యాల జిల్లా హాజీపూర్‌లో పాదయాత్ర మూడు వేల కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. చెన్నూరు నియోజకవర్గం భీమారం బహిరంగసభలో వైఎస్ షర్మిల చెన్నూరు ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు

R Tripura Malini

R Tripura Malini

Next Story