Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కొత్త కాన్వాయ్.. నల్ల రంగు కార్లు

New convoy for Telangana CM Revanth Reddy
x

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కొత్త కాన్వాయ్.. నల్ల రంగు కార్లు

Highlights

Revanth Reddy: ఇంటెలిజెన్స్ విభాగంలోనూ మార్పులు చేసిన ప్రభుత్వం

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కొత్త కాన్వాయ్ వచ్చింది. నిన్నటి వరకు తెల్ల రంగులో ఉన్న వాహనాలు.. జనవరి 24వ తేదీన మాత్రం నల్ల రంగులో కనిపించాయి. కొత్త కాన్వాయ్ తోపాటు.. కొత్త కార్లు రావటం విశేషం. అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి భద్రత విషయంలోనూ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకున్నది. నెల రోజులుగా తెల్ల రంగు కార్లలోనే తిరిగిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు సడెన్ గా నల్ల రంగు కార్ల కాన్వాయ్‌కు మారటం ఆసక్తిగా మారింది.అదే విధంగా ఇంటెలిజెన్స్ విభాగంలోనూ ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. కేసీఆర్ హయాంలో ఆయన దగ్గర పని చేసిన వారి స్థానంలో.. కొత్త వారిని ప్రభుత్వం నియమించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories