ప్రభుత్వ ఆదేశాలను, నిబంధనలను పాటిస్తున్న నూతన వధూవరులు

ప్రభుత్వ ఆదేశాలను, నిబంధనలను పాటిస్తున్న నూతన వధూవరులు
x
మొక్కలు నాటుతున్న నూతన వధూవరులు
Highlights

చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి గాను తెలంగాణ ప్రభుత్వం కొన్ని నిబంధనలను జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం పెట్టిన...

చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి గాను తెలంగాణ ప్రభుత్వం కొన్ని నిబంధనలను జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం పెట్టిన నిబంధనలను పాటిస్తూ ఓ జంట ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా కేవలం 20 మంది సమక్షంలోనే వివాహవేడుకలను జరుపుకున్నారు. అంతే కాదు పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్పూర్తిగా తీసుకుని ఓ మొక్కను కూడా నాటారు.

ప్రభుత్వ ఆదేశాలను, నిబంధనలను నిబద్ధతగా పాటిస్తున్న ఆ జంట వివరాల్లోకెళితే ముఖరం గ్రామానికి చెందిన అంకుష్, కాంబ్లే జిజాబాయ్ ల వివాహాన్ని పెద్దలు కుదిర్చారు. వారిద్దరూ పెళ్లి తంతును హంగు ఆర్భాటాలతో జరుపుకుందాం అని కలలు కన్నారు. సరిగ్గా ఇదే సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో పెళ్లి వాయిదా వేయడం ఇష్టం లేని కుటుంబ పెద్దలు, కేవలం 20 మంది బంధువుల సమక్షంలో భౌతిక దూరం పాటిస్తూ ముఖాలకు మాస్క్ లు ధరించి గ్రామంలోని శివాలయం లో వివాహం జరిపించారు. అనంతరం నూతన వధూవరులు ఇద్దరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా శివాలయం ప్రాంగణంలో మొక్కలను నాటారు. వీరి వివాహానికి ముఖరం గ్రామ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గే సుభాష్ లు కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వధూవరులు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ వివాహ వేడుకని జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. పెళ్లి తంతు ముగిసిన తరువాత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్పూర్తితో ఈ శివాలయం ప్రాంగణంలో మొక్కలు నాటామని తెలిపారు. ఇప్పుడు నాటిన మొక్క కొన్నాళ్లకు పెరిగి ప్రజలకు, పక్షలకు నీడనిస్తుందని తెలిపారు. ఈ మొక్కలు నాటిన జ్ఞాపకం తమకు ఎప్పుడూ గుర్తు ఉంటుందని తెలిపారు. వారి గ్రామంలో ఏ కార్యక్రమం చేపట్టినా కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్పూర్తిగా తీసుకొని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని భవిష్యత్తులో కూడా ఇలాగే చేస్తామని నూతన వధూవరులు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories