జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించాలి

జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించాలి
x
జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య
Highlights

ఈనెల 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించుటకు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు.

మహబూబాబాద్: ఈనెల 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించుటకు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి బూత్ స్థాయి లోని ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఈనెల 25 వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకోవాలని, కొత్తగా రిజిస్టర్ అయిన కనీసం10 మంది ఓటర్లను సన్మానించాలని, రంగోలి ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయాలన్నారు.ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాం ఓటర్ అయినందుకు గర్వంగా ఉందని స్లోగన్ ను కొత్త ఓటర్లతో చదివించాలని అన్నారు.

మండల స్థాయిలో అసెంబ్లీ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించి ర్యాలీలు, మానవ హారాలు నిర్వహించాలన్నారు. మండల స్థాయి, అసెంబ్లీ, జిల్లా స్థాయిలలో వ్యాసరచన, వకృత్వ పోటీలను, నిర్వహించి గెలుపొందిన వారిని జాతీయ ఓటర్ల దినోత్సవం నాడు బహుమతులు అందజేసి సన్మానించాలని, ఈ కార్యక్రమాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులను ఆహ్వానించాలని అన్నారు. అదే రోజు మధ్యాహ్నం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతిజ్ఞ చేయాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఉత్సవాలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అందుకుగాను తహసీల్దార్లు, ఆర్డివో లు పర్యవేక్షించాలన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories