దివీస్ ఫార్మా కంపెనీకి ఎన్జీటీ నోటీసులు

దివీస్ ఫార్మా కంపెనీకి ఎన్జీటీ నోటీసులు
x
NGT
Highlights

కాలుష్యాన్ని ఎక్కువగా విడుదల చేస్తున్న ఓ కంపెనీకి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ నోటీసులు జారీ చేసింది.

కాలుష్యాన్ని ఎక్కువగా విడుదల చేస్తున్న ఓ కంపెనీకి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ నోటీసులు జారీ చేసింది.యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సమీప ప్రాంతంలో ఉన్న దివిస్ ఫార్మా కంపెనీ ఈ నోటీసులను అందుకుంది. ఈ ఫార్మా కంపెనీ ఎక్కువ శాతం కాలుష్యాన్ని విడుదల చేస్తూ చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. దీంతో ప్రజలు రకరకాల వ్యాధులకు గురి అవుతున్నారని, చౌటుప్పల్‌కు చెందిన కాలుష్య పరిరక్షణ సమితి ఎన్జీటీని ఆశ్రయించింది.

దీనిపై విచారణ జరిపిన జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ఎన్జీటీ చెన్నై బెంచ్ కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ ప్రభుత్వం సహా దివీస్ ఫార్మా కంపెనీకి నోటీసులు జారీ చేసింది. అంతే కాకుండా ఓ నిపుణుల కమిటీని చౌటుప్పల్‌లో ఫార్మా కాలుష్యంపై విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా కేంద్ర పర్యావరణ శాఖ ఫార్మా వ్యవహారాల విభాగం, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఐఐటీ, తెలంగాణ డ్రగ్‌ కంట్రోల్‌ శాఖ, యాదాద్రి జిల్లా కలెక్టర్‌ను చేర్చింది. నిబంధనలకు విరుద్ధంగా ఫార్మా కంపెనీలు వ్యవహరించి కాలుష్యానికి కారణమైతే తీసుకోవాల్సిన చర్యలను నివేదించాలని ఎన్జీటీ ఆదేశించింది. ఫార్మా కంపెనీలో తనిఖీలు నిర్వహించి రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని తదుపరి విచారణను ఆగస్టు 21కి వాయిదా వేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories