PM Modi: తెలంగాణకు మరోసారి మోడీ.. 5 రోజుల షెడ్యూల్ ఖరారు

Narendra Modi once again To Telangana
x

PM Modi: తెలంగాణకు మరోసారి మోడీ.. 5 రోజుల షెడ్యూల్ ఖరారు

Highlights

PM Modi: ఒక్కోరోజు మూడు నాలుగు సభల్లో పాల్గొన నున్న మోడీ

PM Modi: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ప్రచారం ముమ్మరం చేసింది. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించిన విషయం తెలిసిందే. తాజాగా, ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మార్చి 16,17,18 వ తేదీల్లో తెలంగాణకు ఆయన రానున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన జగిత్యాల, నాగర్ కర్నూల్, మల్కాజ్‌​గిరిలో బహిరంగ సభల్లో పాల్గొనే అవకాశముందని బీజేపీ రాష్ట్ర నాయకత్వం వెల్లడించింది.

మూడు లోక్‌​సభ స్థానాలు కవర్ చేసే విధంగా ఒక్కో సభ పెట్టాలని బీజేపీ యోచిస్తోంది. ఇప్పటికే ఇటీవలి ప్రధాని మోడీ రెండురోజుల పర్యటనతో కాషాయ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. అయితే, ఎన్నికల షెడ్యూల్ తర్వాత టూర్‌​కు సంబంధించిన షెడ్యూల్ ఖరారు కానుంది. ఏయే తేదీల్లో పర్యటించాలనే అంశంపై కసరత్తు జరుగుతోంది. మోడీ మూడు పర్యటనల్లో భాగంగా చివరి విజిట్​లో హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ల పరిధిలో భారీ రోడ్ షో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories