Allu Arjun Arrest: అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్

Nampally Court Orders Remand to Allu Arjun in Sandhya Theatre stampede
x

     అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ 

Highlights

అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.ఈ నెల 4న సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనను...

అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.ఈ నెల 4న సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనను శుక్రవారం ఉదయం అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.

తొక్కిసలాట ఘటనకు సంబంధించి పోలీసులు ఆయనను విచారించారు. ఆ తర్వాత ఆయనను గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.ఆసుపత్రి నుంచి ఆయనను నేరుగా ఆయనను నాంపల్లి కోర్టుకు తరలించారు. కోర్టులో ప్రభుత్వ తరపు, అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.

తొక్కిసలాటకు అల్లు అర్జున్ కు సంబంధం లేదని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. గతంలో కూడా బెనిఫిట్ షోలకు ఆయన హాజరైన విషయాన్ని గుర్తు చేశారు. పోలీసులకు రెండు రోజుల ముందే బందోబస్తు కోసం సంధ్య థియేటర్ యాజమాన్యం ఇచ్చిన లేఖ గురించి అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.

అయితే ఈ కేసులో సంధ్య థియేటర్ ఘటనకు అల్లు అర్జున్ కారణమని ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదించారు. గతంలో గుజరాత్ వడోదరలో బాలీవుడ్ నటుడు ఒకరు వచ్చిన సమయంలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనను ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories