కన్నవారు పట్టించుకోవడం లేదు.. అయిన వారు వదిలేశారు

కన్నవారు పట్టించుకోవడం లేదు.. అయిన వారు వదిలేశారు
x
Highlights

పెద్దలను కాదని నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తీరా పిల్లలు పుట్టాకా గాలికొదిలేసి తనదారి తను చూసుకున్నాడు భర్త. కసాయిని నమ్మిక పాపానికి...

పెద్దలను కాదని నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తీరా పిల్లలు పుట్టాకా గాలికొదిలేసి తనదారి తను చూసుకున్నాడు భర్త. కసాయిని నమ్మిక పాపానికి నేడు ఆమె కన్న బిడ్డను చదివించుకోలేక, మరో 6 నెలల పసి బిడ్డకు పాలు కూడా పట్టలేని దీన దుస్థితిలో కష్టాల కడలి కొట్టుమిట్టాడుతోంది.

ప్రేమించి.. పెళ్లి చేసుకున్న వ్యక్తి వదిలేశాడు,14 సంవత్సరాలు సాఫీగా సాగిన కాపురం కష్టాల్లో పడింది. భయంకరమైన వ్యాధి ఆరోగ్యాన్ని క్రమంగా తినేస్తోంది. కన్నవారు పట్టించుకోవడం లేదు అయిన వారు వదిలేశారు. కష్టాల కడలిలో బతుకు నెట్టుకొస్తోంది నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ఓ మహిళ

భర్త వదిలి వెళ్లిపోవడంతో ఆమెకు కష్టాలు ఎక్కువయ్యాయి. తినడానికి తిండి లేదు. కష్టం చేసుకుని బతకడానికి శక్తి లేదు. పసిబిడ్డకు పాలు పట్టలేక మరో బిడ్డను చదివించుకోలేక దయనీయ స్థితిలో జీవనం సాగిస్తోంది ఆమె. ఎవరైనా సాయం చేస్తారేమో అని ఎదురుచూస్తోంది.

భర్త తమను వదిలేసి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని బాధితురాలు వాపోతోంది. మరోవైపు తల్లి కష్టం చూసి ఆ చిన్నారి కన్నీళ్లు పెట్టుకుంటోంది. తన తండ్రి చేసిన పని వళ్ల తాము కష్టాలు పడ్డామని వాపోతోంది. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటారు. కానీ ఏ దిక్కు లేని పక్షుల్లాగా జీవిస్తున్న ఈ అభాగ్యులకు తోడు ఎవరు..? అందుకే తమకు న్యాయం జరుగుతుందని హెచ్ఎంటీవీని ఆశ్రయించారు బాధితులు. తమ కష్టాలకు కరిగి సాయం చేసేందుకు ఎవరైనా ముందుకు రాకపోరా అని ఎదురుచూస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories