By-Elections 2021: ప్రారంభమైన నాగార్జునసాగర్ ఉప ఎన్నికల పోలింగ్

Representational Image
By-Elections 2021: దయం 7 గంటల నుంచి సాయంత్రం 7 వరకు పోలింగ్ జరగనుంది.
By-Elections 2021: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 వరకు పోలింగ్ జరగనుంది. ఇందులో నియోజకవర్గ వ్యాప్తంగా 2 లక్షల 20వేల 300 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 1లక్షా, 9వేల, 228 మంది, మహిళలు 1లక్షా ,11వేల, 72 మంది ఉన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ అభ్యర్థులతో పాటు మొత్తం 41 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. మొత్తం 346 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొవిడ్ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ దఫా పోలింగ్ సమయాన్ని రెండు గంటల పాటు పెంచింది.
నాగార్జునసాగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో ఖాళీ అయిన స్థానంలో ఆయన కుమారుడు నోముల భగత్‌కి టిఆర్ఎస్ టికెట్ ఇచ్చి బరిలో దింపింది. కాంగ్రెస్ మొదటగానే మాజీ ఎమ్మెల్యే జానారెడ్డికి అవకాశం ఇచ్చింది. బీజేపీ చివరి వరకు అన్ని ప్రయత్నాలు చేసి రవి కుమార్ నాయక్ ను బరిలో నిలిపింది.
ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘర్షణలు జరగకుండా అదనపు బలగాలను మోహరించారు.. సాగర్ ఉప ఎన్నిక విధులు నిర్వర్తించే సిబ్బందికి అనుములలోని ఐటీఐ కాలేజీ పోలింగ్ సామగ్రిని పంపిణీ చేశారు.
ఎన్నికల బరిలో 41 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నా గులాబీ పార్టీ, హస్తం పార్టీ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. మరోవైపు కాషాయ పార్టీ సాగర్‌లో సత్తా చాటాలని చూస్తోంది. దుబ్బాక లో దెబ్బతినడంతో టీఆర్ఎస్ అన్ని రకాలుగా అలర్ట్ అయింది. నాగార్జునసాగర్ నుండి ప్రతి మండలంలో గ్రామంలో పార్టీ నేతలు విరివిగా ప్రచారం నిర్వహించారు. పార్టీ అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లు ప్రచార సరళిని ఎప్పటికప్పుడు సమీక్షించి సూచనలు చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా గులాబీ పార్టీ శ్రేణులంతా సాగర్‌లో ప్రచారం నిర్వహించారు.
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
మహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMTఅనిల్ రావిపూడి బాలక్రిష్ణ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా!
25 May 2022 3:15 PM GMTఆత్మకూరు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల..
25 May 2022 2:56 PM GMT