YouTuber Anvesh: నా అన్వేషణ అన్వేష్ కేసులో ట్విస్ట్.. రంగంలోకి దిగిన పంజాగుట్ట పోలీసులు

YouTuber Anvesh: ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ తర్వాత నా అన్వేషణ అన్వేష్‌పై పంజాగుట్ట పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. సోషల్ మీడియా కార్యకలాపాలపై నిఘా పెంపు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 25 Feb 2026 3:21 PM IST
YouTuber Anvesh
X

YouTuber Anvesh: నా అన్వేషణ అన్వేష్ కేసులో ట్విస్ట్.. రంగంలోకి దిగిన పంజాగుట్ట పోలీసులు

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు ‘నా అన్వేషణ’ యూట్యూబర్ అన్వేష్‌పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఇటీవల సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్ ఆయన ఖాతాను బ్లాక్ చేసిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ అయిన తర్వాత తనకు రెండు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు, రెండు యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయని పేర్కొంటూ అన్వేష్ ఓ వీడియో విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఆ వీడియోలో అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో సంబంధిత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు కూడా అధికారికంగా లేఖ రాయాలని పంజాగుట్ట పోలీసులు యోచిస్తున్నట్లు సమాచారం. మరో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌తో పాటు యూట్యూబ్ ఛానల్ కార్యకలాపాలపై కూడా పోలీసులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.

తాజాగా జారీ చేసిన లుక్ అవుట్ నోటీసుల ద్వారా అన్వేష్ కదలికలపై పర్యవేక్షణ పెంచిన పోలీసులు, కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story