వికారాబాద్‌ జిల్లాని వదలని వింతవ్యాధి కలకలం

Mysterious Disease Fear Again in Vikarabad District
x

Strange disease in Vikarabad

Highlights

వికారాబాద్‌ జిల్లాలో వింతవ్యాధి కలకలం రేపుతోంది. మొన్న దోర్నాలలో వెలుగుచూసిన ఘటనే నేడు దారూర్‌ మండలంలోనూ రిపీట్‌ అయ్యింది. మైలారంలో అంతుచిక్కని...

వికారాబాద్‌ జిల్లాలో వింతవ్యాధి కలకలం రేపుతోంది. మొన్న దోర్నాలలో వెలుగుచూసిన ఘటనే నేడు దారూర్‌ మండలంలోనూ రిపీట్‌ అయ్యింది. మైలారంలో అంతుచిక్కని వ్యాధితో కోళ్లు, కాకులు, మేకలు అధిక సంఖ్యలో మృతి చెందాయి. సమాచారం అందుకున్న పశు వైద్యాధికారులు మృత్యువాత పడిన మూగజీవాల శాంపిల్స్‌ను ల్యాబ్‌కు తరలించారు. అయితే వ్యాధి ఏంటనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. మరోవైపు కోళ్లు, మేకల మృతితో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

గతంలో కూడా వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండలం చిట్టిగిద్దలో వింత వ్యాధితో 20 మంది అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన వారిని స్థానికులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కల్తీ కల్లు తాగడం వల్లే అస్వస్థతకు గురయ్యారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు.

Show Full Article
Print Article
Next Story
More Stories