Medak: మానవత్వం చాటుకున్న మైనంపల్లి రోహిత్‌..మెదక్‌ జిల్లా నస్కల్‌లో నిరుపేద మహిళకు సాయం

Myanampally Rohit Helped a Poor Woman in Naskal Medak District
x

Medak: మానవత్వం చాటుకున్న మైనంపల్లి రోహిత్‌..మెదక్‌ జిల్లా నస్కల్‌లో నిరుపేద మహిళకు సాయం

Highlights

Medak: పిల్లల చదువు కోసం రూ.25వేలు డిపాజిట్‌, సొంత నిధులతో ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ.

Medak: మెదక్‌ జిల్లాలో ఇల్లు లేని ఓ నిరుపేద మహిళకు అండగా నిలిచారు మైనంపల్లి రోహిత్‌. నస్కల్‌ గ్రామానికి చెందిన పేద మహిళ లక్ష్మి భర్త చనిపోవడంతో కుటుంబాన్ని నెట్టుకు రావడం కష్టంగా మారింది. పిల్లల పోషణ, చదువు చెప్పించడం భారంగా మారింది. పూరిగుడిసెలో నివాసం ఉంటోంది. విషయం తెలుసుకున్న మైనంపల్లి రోహిత్‌ స్వయంగా నస్కల్‌ గ్రామానికి చేరుకుని ఆమె పరిస్థితి చూసి చలించిపోయారు. ఆమె పిల్లల పేరిట 25 వేల రూపాయలు డిపాజిట్ చేయడంతో పాటు, ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తా నని హామీ ఇచ్చారు. మైనంపల్లి స్పందించిన తీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

నస్కల్‌ నుంచి నిజాంపేట్‌ మండలం వెంకటాపూర్‌కు తన అనుచరులతో ర్యాలీగా బయల్దేరి వెళ్లారు. వెంకటాపూరంలో తల్లి దండ్రులు లేని చిన్నారులకు ఒక్కొక్కరికి 25వేల రూపాయలు డిపాజిట్‌ చేయడంతో పాటు సొంత నిధులతో ఇల్లు కట్టించి ఇస్తానంటూ హామీ ఇచ్చారు. గ్రామంలో నీటి సమస్యను తీర్చేందుకు బోరు వేయిస్తానన్నారు. అయితే ఈ పనులన్నీ ఏ ఒకట్రెండు గ్రామాలకే పరిమితం కాకుండా మెదక్‌ నియోజకవర్గంలోని ఏ సమస్య ఉన్నా తీర్చుతానంటూ హామీ ఇచ్చారు. వెంకటాపురం వాసులు మైనంపల్లి రోహిత్‌ను సత్కరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories