Nalgonda: నల్గొండ కాంగ్రెస్ నేత కుమారుడిపై మర్డర్ కేసు

Murder Case File On Congress Leader Son Nalgonda
x

Nalgonda: నల్గొండ కాంగ్రెస్ నేత కుమారుడిపై మర్డర్ కేసు

Highlights

Nalgonda: వివాహిత తల్లిదండ్రులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు

Nalgonda: నల్గొండ జిల్లాకు చెందిన సినీయర్ కాంగ్రెస్ నేత కుమారుడు తన భార్యను చంపి గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కానీ యువతి తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోస్ట్‌మార్టంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

నల్గొండ జిల్లా నిడమనూరుకు చెందిన కాంగ్రెస్ లీడర్ ఎవడల్లి రంగసాయిరెడ్డి కుమారుడు వల్లబ్ రెడ్డికి లహరి రెడ్డితో ఏడాది క్రితం వివాహం జరిగింది. ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. అదును చూసి కట్టుకున్న భార్యను వల్లబ్ రెడ్డి హతమార్చాడు. ఆ తర్వాత హత్యను గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్న వల్లబ్ తన పలుకుబడిని ఉపయోగించుకోవాలని అనుకున్నాడు. కానీ పోస్ట్‌మార్టంలో అసలు నిజాలు బయటకు వచ్చాయి.

లహరిరెడ్డి గుండెపోటుతో చనిపోలేదని శరీరం లోపల తీవ్ర స్థాయిలో గాయాలు అయ్యాయని పోస్టుమార్టం నివేదికలో తేలింది. తన భార్య కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు నారయణగూడ పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. ఆ క్రమంలో నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. వల్లబ్ రెడ్డి హత్య చేసి సాక్షాలు చెరిపేసినట్లుగా పోలీసులు నిర్దారించారు. నిందితుడిపై సెక్షన్ 201, 302 కింద కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories