మందకృష్ణ మాదిగ అరెస్టు

మందకృష్ణ మాదిగ అరెస్టు
x
Highlights

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఎమ్మార్మీస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తలపెట్టిన దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తుగా ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు.

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఎమ్మార్మీస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తలపెట్టిన దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తుగా ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మార్మీస్ ఇందిరా పార్క్ వద్ద దీక్షజరపాలని నిర్ణయించింది. అయితే దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు నిరాకరించారు. దీక్షల్లో పాల్గొనడానికి వచ్చిన కొందరి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని నల్లకుంట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇందిరాపార్కు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. పరిసర ప్రాంతాల్లో పొలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

దీక్షపై పోలీసులు స్పందించారు. దీక్షా ప్రాంగణంతో అసాంఘిక శక్తులు అలజడి సృష్టించే అవకాశం ఉందని సమాచారం అందడంతోనే అనుమతి నిరాకరించామని తెలిపారు.మంద కృష్ణ హబ్సిగూడలోని ఓ హోటల్లో ఉన్నారనే సమచారంతో ఆయన్ని అరెస్టు చేసి నాచారం పీఎస్ కు తరలించారు. ఈ సందర్బంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులవి న్యామమైన డిమాండ్లలని ప్రభుత్వం కావాలనే వారిని పట్టించుకోవడంలేదన్నారు.

అన్ని వర్గాల మద్దతు ఆర్టీసీ కార్మికులకు ఉండాలనే దీక్షకు సిద్దపడ్డామని తెలిపారు. శాంతియుతంగా చేసే దీక్షను కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకుంటుందని విమర్శించారు. అప్రజాస్వామికంగా సీఎం వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. దీక్షను చేసి తీరుతామని మందకృష్ణ తెలిపారు.ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి గృహ నిర్బంధంలోనే ఉన్నారు. తన నివాసంలోనే దీక్ష కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పట్ల సానుకూలంగా స్పందించే వరకు నిరవధిక దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories