తెలంగాణనుంచి బీజేపీ నేత లక్ష్మణ్‌కు రాజ్యసభ సీటు

MP Seat For Telangana BJP Leader K Laxman
x

తెలంగాణనుంచి బీజేపీ నేత లక్ష్మణ్‌కు రాజ్యసభ సీటు

Highlights

Laxman: రేపు మధ్యాహ్నం రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్న లక్ష్మణ్

Laxman: రాజ్యసభ అభ్యర్ధుల ఎంపిపై కసరత్తు చేస్తున్న బీజేపీ నలుగురు అభ్యర్ధులతో రెండో జాబితా విడుదల చేసింది. తెలంగాణనుంచి బీజేపీ సీనియర్ నాయకులు లక్ష్మణ్‌కు రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని ఖారారు చేశారు. ఆయనకు ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించనున్నారని సమాచారం. యూపీనుంచి మిథిలేశ్ కుమార్ లక్ష్మణ్, డాక్టర్ లక్ష్మణ్, కర్ణాటకనుంచి లహర్ సింగ్ సిరోయ, మధ్యప్రదేశ్ నుంచి సుమిత్ర వాల్మికి అభ్యర్థిత్వాన్ని బీజేపీ కేంద్ర కార్యాలయం ఖరారు చేసింది.

తెలంగాణకు నుంచి రాజ్యసభకు ఎంపిక అయిన డాక్టర్ కే.లక్మణ్ ను ఉత్తరప్రదేశ్ నుంచి అభ్యర్ధిగా ప్రకటించారు. లక్ష్మణ్ ప్రస్తుతం బీజేపీ ఓబీసి జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గతంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా, ముషీరాబాద్ ఎమ్మెల్యేగా పని చేశారు. ఆయన ఇవాళ లక్నో వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్నారు. 15 రాష్ర్టాలకు చెందిన 57 రాజ్యసభ స్థానాలకు జూన్ 10న పోలింగ్ జరగనున్నది. ఇప్పటికే తొలి జాబితాలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పేర్లను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. కర్నాటక నుంచి నిర్మలా సీతారామన్, మహారాష్ట్ర నుంచి పీయూష్ గోయల్ మరోసారి పోటీ చేయనున్నారు.

రాజ్యసభ అభ్యర్థుల జాబితాపై బీజేపీ కుస్తీ పడుతున్నది. 18 మంది అభ్యర్థుల జాబితా తయారీలో మల్లగుల్లాలు పడుతున్నది. కాగా, జార్ఖండ్‌ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్న కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌తోపాటు రాజ్యసభలో బీజేపీ చీఫ్‌ విప్‌, కేంద్ర మాజీ మంత్రి శివ ప్రతాప్‌ శుక్లా, బీజేపీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ గౌతమ్, ఓపీ మాథుర్, వినయ్ సహస్త్రబుద్ధే పేర్లను జాబితా నుంచి తొలగించారు. అలాగే బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్ జాఫర్ ఇస్లామ్‌, యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి సమాజ్‌వాదీ పార్టీలో చేరిన సంజయ్ సేథ్ పేర్లు కూడా జాబితాలో లేవు.

Show Full Article
Print Article
Next Story
More Stories