Komatireddy Venkat Reddy: డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వకపోతే.. ప్రగతిభవన్‌ను ముట్టడిస్తాం..

MP Komatireddy Venkat Reddy Open Letter To CM KCR
x

సీఎం కేసీఆర్‌కు ఎంపీ కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బహిరంగ లేఖ

Highlights

Komatireddy Venkat Reddy: డీఎస్సీకి వారం రోజుల్లో ప్రకటన చేయాలని డిమాండ్

Komatireddy Venkat Reddy: సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు? వారం రోజుల్లో ప్రకటన చేయాలి.. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడిస్తాం అని ఆ లేఖలో పేర్కొన్నారు. లక్షల మంది నిరుద్యోగుల అవస్థల గురించి బహిరంగ లేఖలో వివరించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఏం జరుగుతోంది? నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో సాగిన ఉద్యమ ఆకాంక్షలు ఎక్కడ నెరవేరాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులను అక్కడే వదిలేశారు. మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మర్చారు. అనవసర ఆర్భాటాలకు పోయి ప్రజాధనం వృథా చేస్తున్నారని కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories