MP Arvind: నా ద్వారా పార్టీలోకి వచ్చినంత మాత్రాన టికెట్‌ గ్యారంటీ లేదు

* పార్టీ అదేశిస్తే అసెంబ్లీకి కూడా పోటీ చేస్తా * ఈడీ నోటీసుల భయంతోనే కేసీఆర్‌ ఢిల్లీకి పరుగు

Sandeep Reddy
Updated on: 12 Dec 2021 3:30 PM IST
MP Dharmapuri Arvind says There is no Guarantee of a Ticket as Long as you Come to the Party Through me
X

ఎంపీ అర్వింద్‌ (ఫోటో: ది హన్స్ ఇండియా)

MP Dharmapuri Arvind: మీడియా చిట్‌చాట్‌లో నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఆదిశిస్తే అసెంబ్లీకి కూడా పోటీ చేస్తానన్నారు ఆయన. తన ద్వారా పార్టీలోకి వచ్చినంత మాత్రానా టికెట్‌ గ్యారెంటీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని చెప్పిన అర్వింద్‌, కాంగ్రెస్‌, టీఆర్ఎస్ పొత్తు పెట్టుకునే అవకాశం ఉండనున్నట్లు చెప్పారు. ఇక పార్టీలో చేరి పనిచేయని నేతలను సహించబోమన్నారు. టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు కూడా టచ్‌లో ఉన్నారంటున్న ఎంపీ ధర్మపురి అర్వింద్‌, ఈడీ నోటసుల భయంతోనే కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లినట్లు చెప్పారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story