Bandi Sanjay: సీఎం రేవంత్‌రెడ్డికి ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ

MP Bandi Sanjay Open Letter To CM Revanth Reddy
x

Bandi Sanjay: సీఎం రేవంత్‌రెడ్డికి ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ

Highlights

Bandi Sanjay: తక్షణమే మొత్తం బకాయిలను చెల్లించాలి- ఎంపీ బండి సంజయ్

Bandi Sanjay: సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవాలని ఎంపీ బండి సంజయ్ కోరారు. సీఎం రేవంత్‌రెడ్డికి ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. సిరిసిల్ల జిల్లాలో వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందన్నారు. చేనేత రంగంపై ఆధారపడ్డ 20వేల మంది కార్మికులు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సిరిసిల్ల సంక్షోభానికి గత ప్రభుత్వంతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ విధానాలే ప్రధాన కారణమని పేర్కొన్నారు. బతుకమ్మ చీరల బకాయిలు 220 కోట్లు చెల్లించకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. కార్మికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని..తక్షణమే మొత్తం బకాయిలను చెల్లించాలని బండి సంజయ్ కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories