Bandi Sanjay: దొంగ హామీలు, దగా మాటలు, దౌర్జన్య చేతలకు కాలం చెల్లింది

MP Bandi Sanjay Counter To Minister KTR Tweet
x

Bandi Sanjay: దొంగ హామీలు, దగా మాటలు, దౌర్జన్య చేతలకు కాలం చెల్లింది

Highlights

Bandi Sanjay: ఇప్పుడు గాయి చేస్తే నమ్మేందుకు తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు

Bandi Sanjay: మంత్రి కేటీఆర్‌ ట్విట్‌కు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ కౌంటర్‌ ఇచ్చారు. కారు గ్యారేజ్‌కు పోతుందని ట్విట్టర్‌ టిల్లు నారాజ్‌ అవుతున్నాడని బండి సంజయ్‌ ట్విట్‌ చేశారు. నిజామాబాద్‌లో చెల్లె ఓటమి ఖాయమైందని అన్న ముందే ఆగమైతున్నాడని అన్నారు. తొమ్మిదేళ్ల మీ దొంగ హామీల జపం బట్టబయలైందని బండి సంజయ్‌ విమర్శించారు. వరంగల్‌కు డల్లాస్‌ కాలే..కనీసం బస్టాండ్‌ కూడా రాలేదు కానీ.. వరదలు, బురదలు బోనస్‌గా వచ్చాయన్నారు. తొమ్మిదేండ్లు గాడిద పండ్లు తోమి..ఇప్పుడు గాయి చేస్తే నమ్మేందుకు తెలంగాణ ప్రజలు అమాయకులు కాదని ఆయన ట్విట్టర్‌లో మండిపడ్డారు. దొంగ హామీలు, దగా మాటలు, దౌర్జన్య చేతలకు కాలం చెల్లిందన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories