MP Arvind: కేటీఆర్ సవాల్ పై స్పందించిన ఎంపీ అర్వింద్

MP Arvind: కేటీఆర్ రాజీనామా లేఖతో చర్చకు రావాలి

Sandeep Eggoju
Published on: 15 Sept 2021 4:32 PM IST
MP Arvind Responds on Minister KTR Challenge
X

మంత్రి కేటీఆర్ సవాల్ పై స్పందించిన ఎంపీ అరవింద్ (ఫైల్ ఇమేజ్)

MP Arvind: బీజేపి, టీఆర్ఎస్ పార్టీ లమధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. బండి సంజయ్ కి మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్ పై ఎంపీ అర్వింద్ స్పందించారు. కేటీఆర్ రాజీనామా లేఖతో చర్చకు రావాలని లేదంటే రాజీనామా చేసి రాష్ట్రం విడిచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఇచ్చే పన్నుల కంటే కేంద్రం తెలంగాణకు ఎక్కువే సాయం అందిస్తోందని చెప్పారు. దొడ్డు బియ్యం కొనమని కేంద్రం ఎక్కడా చెప్పలేదని మంత్రి హరీష్ రావు తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. బియ్యం సేకరణ కోసం ప్రతి పైసా ఇప్పటి వరకు కేంద్రమే ఇచ్చిందన్నారు. వేరుశనగ, పొద్దు తిరుగుడు, సొయా, చెరుకు వంటి పంటలు ప్రభుత్వ వైఖరి తో కనపడ కుండా పోయాయన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story