Arvind Dharmapuri: ప్రశాంత్‌ రెడ్డి వాడిన భాష పట్ల అర్వింద్ తీవ్ర అభ్యంతరం..

MP Arvind Dharmapuri Fire On Minister Vemula Prashanth Reddy
x

Arvind Dharmapuri: తల్లిదండ్రులను కించపరిచేలా మాట్లాడటం సరికాదని హితువు

Highlights

Arvind Dharmapuri: పేరు ఎందుకు మార్చాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలి

Arvind Dharmapuri: అమ్మానాన్నల గురించి మంత్రి ప్రశాంత్ రెడ్డి వాడిన పదాలపై నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా మాట్లాడితే రాజకీయ జీవితం శూన్యం అవుతుందని హెచ్చరించారు. కాగా కేంద్రం నిధులతో చేసిన పనుల విషయంలో నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్, మంత్రి ప్రశాంత్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎంపీ అర్వింద్‌.. మంత్రి వేములపై విరుచుకుపడ్డారు. కేంద్ర నిధులతో పనులు చేసినట్టు ఒప్పుకున్న మంత్రి...పేరేందుకు మర్చాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలన్నారు. బట్టాపూర్ క్వారీ విషయంలో ఎందుకు స్పందించడం లేదని అర్వింద్‌ ప్రశ్నించారు. సీబీఐ విచారణకు సిద్ధమని అంటున్న ప్రశాంత్ రెడ్డి..రాష్ట్రంలో ఆ సంస్థకు అనుమతి నిరాకరణను ఎత్తివేయాలని ఎంపీ అర్వింద్ డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories