సీఎం అభద్రతా భావంతో ఉన్నారు-ఎంపీ అరవింద్

సీఎం అభద్రతా భావంతో ఉన్నారు-ఎంపీ అరవింద్
x
Highlights

*సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై ఎంపీ ధర్మపురి అరవింద్ ఫైర్ *కేసీఆర్ ను బండకేసి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు

వచ్చే అసెంబ్లీ ఎన్నికలు.. అంతకు ముందు జరిగే ఉపఎన్నికల్లోపే ప్రజలు సీఎం కేసీఆర్ ను బండకేసి కొడుతారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎద్దేవా చేశారు. సీఎం‌ కేసీఆర్ పై పార్టీ నేతల్లోనే విశ్వాసం సన్నగిల్లడం, కుటుంబం‌పై నమ్మకం పోయిందని అన్నారు. ఏ హక్కుతో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తాయని చెప్పారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై గవర్నర్‌ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సీఎం అభద్రతా భావంతో ఉన్నాడు. పార్టీలో వ్యతిరేక గళం వినిపిస్తున్నారన్న భయంతో బెదిరింపులకు దిగుతున్నాడని అరవింద్ చెప్పారు. టీఆర్ఎస్ లో ఈటెల రాజేందర్ కు మాత్రమే సీఎం పదవి అవకాశం ఉందని..కేసీఆర్ తన కొడుకును ముందు శిక్షించి తర్వాత మాత్రమే ఇతరుల గురించి మాట్లాడాలని హితవు పలికారు.

Show Full Article
Print Article
Next Story
More Stories