తెలుగు రాష్ట్రాల్లో ట్రిపుల్‌ ఆర్‌ మూవీ ఫీవర్‌

Movie Ticket Price in AP and Telangana | Telugu News
x

తెలుగు రాష్ట్రాల్లో ట్రిపుల్‌ ఆర్‌ మూవీ ఫీవర్‌

Highlights

*టికెట్ల రేట్లు అధికంగా ఉన్నాయంటూ ఫ్యాన్స్‌ గోల

Movie Ticket Price: తెలుగు రాష్ట్రాల్లో ట్రిపుల్‌ ఆర్‌ మూవీ ఫీవర్‌ మొదలైంది. రేపు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కాబోతోంది. అయితే టికెట్ల రేట్లు అధికంగా ఉన్నాయంటూ ఫ్యాన్స్‌ గోల చేస్తున్నారు. దీంతో డబ్బు రికవరీ విషయంలో బయ్యర్స్‌ టెన్షన్‌ పడుతున్నారు. సినిమాను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయగా ఆశించిన మేర లాభాలు రాకపోతే ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు.

మరోవైపు భీమ్లానాయక్‌, రాధేశ్యామ్ వసూళ్లు అంతంతమాత్రంగానే జరగడంతో ఆ భయం మరింత ఎక్కువైంది. ఇదిలా ఉంటే పక్క రాష్ట్రాల్లో ట్రిపుల్‌ ఆర్‌కు అడ్వాన్స్‌ బుకింగ్‌ చాలావరకు తగ్గిందని ఫిల్మ్‌నగర్‌లో టాక్‌ నడుస్తోంది. ఢిల్లీ, చెన్నై, ముంబై, బెంగళూరులో 50శాతం కూడా బుకింగ్‌ దాటలేదని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories