కన్నతల్లే కసాయి లాగా మారింది.. కన్నకూతురునే బస్సు కిందకి తోసేసింది

కన్నతల్లే కసాయి లాగా మారింది.. కన్నకూతురునే బస్సు కిందకి తోసేసింది
x
Highlights

ఏ కన్నతల్లి అయిన ఎంత కష్టం వచ్చిన తన పిల్లలు బాగుండాలని కోరుకుంటుంది. కానీ ఓ తల్లి మాత్రం సభ్యసమాజం తలదించుకునే పనిచేసింది. కన్నకూతురునే బస్సు కింద...

ఏ కన్నతల్లి అయిన ఎంత కష్టం వచ్చిన తన పిల్లలు బాగుండాలని కోరుకుంటుంది. కానీ ఓ తల్లి మాత్రం సభ్యసమాజం తలదించుకునే పనిచేసింది. కన్నకూతురునే బస్సు కింద పడేసింది. ఈ ఘటన హైదరాబాద్ లోని కూకట్పల్లిలో చోటుచేసుకుంది. తన కూతురుతో కలిసి అలా రోడ్డు పైన వెళ్తుండగా ఒక్కసారిగా తన చేతిలో ఉన్న బిడ్డను ప్రయాణిస్తున్న బస్సు వైపు విసిరేసింది.

స్థానికంగా అక్కడ ఉన్నవాళ్ళు షాక్ కి గురయ్యారు. కానీ ఆ బస్సు డ్రైవర్ చాలా అప్రమత్తంగా ఉండడంతో సడన్ బ్రేక్ వేసాడు. దీనితో ఆ పాపకి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ ఆ పాపని బలవంతగా విసిరేయడంతో చిన్న చిన్న గాయాలు అయ్యాయి. వెంటనే పాపని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇదంతా గమనిస్తున్న స్థానికులు సదరు తల్లిని చెట్టుకు కట్టేసి దేహశుద్ది చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories