మరో రెండు నెలల్లో వస్తానన్నాడు.. అంతలోనే అందనంత దూరం వెళ్లిపోయాడు..

మరో రెండు నెలల్లో వస్తానన్నాడు.. అంతలోనే అందనంత దూరం వెళ్లిపోయాడు..
x
Highlights

గాల్వనో లోయ ఘర్షణల్లో మన తెలుగు జవాన్‌ వీరమరణం చెందాడు. సూర్యాపేటకు చెందిన కల్నల్‌ సంతోష్‌ బాబు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం...

గాల్వనో లోయ ఘర్షణల్లో మన తెలుగు జవాన్‌ వీరమరణం చెందాడు. సూర్యాపేటకు చెందిన కల్నల్‌ సంతోష్‌ బాబు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. తమ కుమారుడు సోమవారం మరణించినా మరణవార్త నిన్న మధ్యాహ్నం తెలిసిందంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తన కుమారుడు దేశం కోసం పోరాడి అమరుడయ్యాడని అందుకు సంతోషంగా ఉందని సంతోష్ బాబు తల్లి చెప్పింది. కానీ ఓ తల్లిగా మాత్రం తన కుమారుడి మరణాన్ని తట్టుకోలేకపోతున్నట్లు వెల్లడించింది.

2004 నుంచి సైన్యంలో పనిచేస్తున్న సంతోష్‌ ప్రస్తుతం బిహార్ 16 వ యూనిట్‌కు కమాండింగ్‌ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి చురుగ్గా ఉండే సంతోష్ ఆరో తరగతి నుంచి కోరుకొండ సైనిక్ స్కూళ్లో చదివాడు. ఆ తర్వాత పూణేలోని డిగ్రీ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరాడు. సంతోష్ తొలి పోస్టింగ్ జమ్మూలో పడింది. ఏడాదిన్నరగా చైనా సరిహద్దులో విధులు నిర్వహిస్తున్నారు. తన ప్రతిభతో 37 ఏళ్లకే లెఫ్టినెంట్ కల్నల్ స్థాయికి ఎదిగిన సంతోష్ జీవితంలో ఇంకా ఏంతో సాధించాల్సి ఉండగా అతి చిన్న వయసులోనే వీర మరణం పొందారు. ఈ మధ్యనే హైదరాబాద్ కు బదిలీ అయినప్పటికీ లాక్ డౌన్ కారణంగా సంతోష్ సరిహద్దులోనే ఉండిపోవాల్సి వచ్చింది. లాక్ డౌన్ లేకపోతే సంతోష్ బతికి ఉండే అవకాశం ఉండేది. కానీ అంతలోనే వాస్తవాధీన రేఖ దగ్గర చైనా ఎత్తుగడలతో ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఘర్షణలు చోటు చేసుకోవడం.. ఆ ఘటనలో సంతోష్ ప్రాణాలు కోల్పోవడం విధి రాత అలా ఉందని అనుకోవాల్సిందే. సంతోష్ కుమార్ కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కుమార్తె అభిజ్ఞ, కుమారుడు అనిరుధ్ ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నారు.

సంతోష్ పార్థీవదేహం ఈ సాయంత్రానికి హైదరాబాద్ కు చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం రాత్రి సమయంలో సంతోష్ బాబు తల్లిదండ్రులు హెచ్‌ఎంటీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆదివారం రాత్రి సంతోష్‌ తమతో ఫోన్‌లో మాట్లాడాడని దంపతులు తెలిపారు. త్వరలోనే హైదరాబాద్‌లో సెటిల్‌ అవుతాడని అనుకున్నామని అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లాడంటూ తల్లి కన్నీటి పర్యంతమైంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories