logo
తెలంగాణ

Mohan Bhagwat: దిల్లీ మసీదులో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌.. మతపెద్దలతో భేటీ..

Mohan Bhagwat meets Imam Umer Ahmed Ilyasi
X

Mohan Bhagwat: దిల్లీ మసీదులో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌.. మతపెద్దలతో భేటీ..

Highlights

Mohan Bhagwat: దిల్లీ మసీదులో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌.. మతపెద్దలతో భేటీ..

Mohan Bhagwat: ఢిల్లీలోని కస్తూర్బా గాంధీ‎మార్గ్ లోని మసీదు అత్యంత అరుదైన భేటీకి వేదికైంది. RSS కీలక నేతలతో కలిసి మసీదుకు వెళ్లిన ఆ సంస్థ సారథి మోహన్ భగవత్ అఖిల భారత ఇమామ్​ల సంఘం అధినేత ఉమర్​ అహ్మద్ ఇల్యాసీతో సమావేశమయ్యారు. గంటపాటు వేర్వేరు అంశాలపై చర్చించారు. పలురాష్ట్రాలో మదర్సాలను కూల్చివేస్తున్న తరుణంలో అఖిల భారత్ ఇమామ్ల సంఘం అధినేత ఇల్యాసీతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సారథి మోహన్ భగవత్​ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈసందర్భంగా అఖిల భారత ఇమామ్​ల సంఘం కార్యాలయంలో ఇల్యాసీతో ఆయన ప్రత్యేకంగాభేటీ అయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ ఆహ్వానం మేరకు భగవత్ మదర్సాను సందర్శించడం సంతోష కరమన్నారు. ఇక మోహన్ ను జాతిపితతోపోల్చిన ఇల్యాసీ దేశం ముందు అందరి సిద్దాంతం ఒక్కటేనన్నారు. దేవుడ్ని ఆరాధించే పద్ధతులే వేరన్నారు.

Web TitleMohan Bhagwat meets Imam Umer Ahmed Ilyasi
Next Story