Green India Challenge: ఎంపీ సంతోష్ కు ప్రధాని అభినందన

Modi Praised MP Santhosh Kumar About Green India Challeng
x

PM Modi-MP Santhosh Kumar:(File Image)

Highlights

Green India Challenge: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎం.పీ సంతోష్ కుమార్‌ను మోడీ అభినందించారు.

Green India Challenge: గత ఏడాది కాలంగా పట్టు వదలని విక్రమార్కుడిలా చెట్లు నాటే కార్యక్రమాన్ని నాన్ స్టాప్ గా నిర్వహిస్తున్న ఎంపీ సంతోష్ కు ప్రధాని మోదీ అభినందనలు తెలియచేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో సెలెబ్రిటీలను, వ్యాపారవేత్తలను, రాజకీయ నాయకులను ఇన్ వాల్వ్ చేస్తూ.. చెట్లు నాటే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు ఎంపీ సంతోష్ కుమార్. పైకి కనపడకపోయినా.. ఈ కార్యక్రమం భారీ ఎత్తునే సాగుతోంది. కోవిడ్ సమయంలో అప్పుడప్పుడు గ్యాప్ ఇచ్చినా.. నిర్విరామంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ప్రధాని దృష్టికి కూడా వెళ్లటం.. ఆయన అభినందనలు తెలియచేయటంతో... గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి మరింత ఆదరణ దక్కే అవకాశముంది.

అలాగే సంతోష్ విడుదల చేసిన వృక్ష వేదం పుస్తకం పైనా ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతమైన కార్యక్రమం అని కొనియాడారు. పచ్చదనం పెంపు దిశగా యువతకు మార్గనిర్దేశం చేస్తున్నారని అభినందించారు. అలాగే ప్రకృతితో మన అనుబంధాన్ని తెలిపిని పుస్తకం 'వృక్ష వేదం' అని అన్నారు. ఈ పుస్తకాన్ని అందరూ చదవాలని, ప్రేరణ పొందాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

పచ్చదనం పెంపు అవసరాన్ని, అనివార్యతను దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరిలో స్ఫురింపచేస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అభినందనీయం అన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి తెలుసుకున్న తనకు మనసు ఉప్పొంగిందని, ఈ కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ రాజ్యసభ ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు ప్రధాని మోదీ ప్రత్యేకంగా లేఖ రాశారు. పచ్చదనం పెంచటంతో పాటు, పరిశుభ్రత అవసరాన్ని అందరికీ తెలియచేస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను మొదలు పెట్టి, కొనసాగిస్తున్నందుకు ఎంపీకి శుభాకాంక్షలు తెలిపారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతమైన కార్యక్రమం అని కొనియాడారు. పచ్చదనం పెంపు దిశగా యువతకు మార్గనిర్దేశం చేస్తున్నారని అభినందించారు. అలాగే ప్రకృతితో మన అనుబంధాన్ని తెలిపిని పుస్తకం 'వృక్ష వేదం' అని అన్నారు. ఈ పుస్తకాన్ని అందరూ చదవాలని, ప్రేరణ పొందాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి తెలుసుకున్న తనకు మనసు ఉప్పొంగిందని, ఈ కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ రాజ్యసభ ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు ప్రధాని మోదీ ప్రత్యేకంగా లేఖ రాశారు. పచ్చదనం పెంచటంతో పాటు, పరిశుభ్రత అవసరాన్ని అందరికీ తెలియచేస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను మొదలు పెట్టి, కొనసాగిస్తున్నందుకు ఎంపీకి శుభాకాంక్షలు తెలిపారు.

లేఖ ద్వారా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను అభినందించిన ప్రధాన మంత్రికి ఎంపీ సంతోష్ కుమార్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని ఇచ్చిన ప్రోత్సాహంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను మరింత ముందకు తీసుకువెళ్తామన్నారు


Show Full Article
Print Article
Next Story
More Stories